పెంబి క్రికెట్ టోర్నీ విజేత గుమ్మెన

పెంబి, ఖానాపూర్ వెలుగు: పెంబి మండల కేంద్రంలో ఇటిక్యాల తండా గ్రామస్తుడు పరుశురాం స్మారకంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గుమ్మెన జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో మొత్తం 35 టీమ్స్ పాల్గొనగా.. గుమ్మెన, ఇటిక్యాల జట్లు ఫైనల్​కు చేరాయి. గురువారం జరిగిన ఫైనల్​లో ఇటిక్యాలపై గుమ్మెన జట్టు విజయం సాధించించినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతకు రూ.20 వేల నగదుతోపాటు ఫీల్డ్, రన్నరప్​కు రూ.10 వేలు, షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంఈవో రాంచందర్, ఎస్ఐ హన్మాడ్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్ లో ముగిసిన కేపీఎల్ పోటీలు

ఖానాపూర్ పట్టణంలో 5 రోజులపాటు నిర్వహించిన ఖానాపూర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 10 జట్లు పాల్గొనగా విజేతగా పవర్ పాంథర్, రన్నరప్​గా చిరుత టీమ్​లు నిలిచాయి. ఫైనల్​లో తలపడ్డ రెండు జట్లకు నగదుతో పాటు మెమొంటోలు అందజేశారు.